
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా ఫలితం ఎలా ఉన్నా కలక్షన్స్ బీభత్సం సృష్టించగలిగే హీరో. రీసెంట్ గా త్రివిక్రం కాంబినేషన్ లో వచ్చిన అజ్ఞాతవాసి సినిమా అంచనాలను అందుకోలేదు. ఎలాగోలా సినిమాను 12 నిమిషాల దాకా ట్రిం చేసి వెంకటేష్ తో చేసిన సీన్స్ యాడ్ చేస్తున్నారట. ఇక ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా పవన్ తన తర్వాత సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టాడట. అప్పుడెప్పుడో ముహుర్తం పెట్టిన నీషన్ డైరక్షన్ లో సినిమా మళ్లీ తెర మీదకు వచ్చింది.
ఏఎం రత్నం ఆ సినిమాను నిర్మిస్తారట. ఇక ఈ సినిమాకు చరిత్ర అని టైటిల్ పరిశీలణలో ఉందట. ఏఎం రత్నం ఈ టైటిల్ రిజిస్టర్ చేయించారట. ఇది కచ్చితంగా పవన్ సినిమాకు అనుకుంటున్నదే అని తెలుస్తుంది. వేదాళం రీమేక్ గా ఈ సినిమా వస్తుందట. మరి కాటమరాయుడుతో దెబ్బతిన్న పవన్ మళ్లీ అలాంటి రిస్క్ చేయడం ఎంతవరకు సేఫ్ అన్నది ఆలోచించాలి. సినిమా టైటిల్ చరిత్ర అన్నది చూస్తుంటే పవన్ కచ్చితంగా చరిత్ర సృష్టించడం ఖాయమనిపిస్తుంది. మరి ఈ ప్రాజెక్ట్ కు సంబందించిన మరికొన్ని డీటైల్స్ త్వరలో వెళ్లడించనున్నారు.