
నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా కె.ఎస్ రవికుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా జై సింహా. ఈ నెల 12న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈరోజు జరిగింది. సినిమాపై పూర్తి నమ్మకంతో ఉన్న బాలయ్య సంక్రాంతికి పక్కా హిట్ కొడుతున్నాం అన్నంత జోష్ లో ఉన్నాడు. ఇక నిర్మాత సి.కళ్యాణ్ అయితే సినిమా సూపర్ హిట్ అవుతుందని బల్ల గుద్ది మరి చెప్పారు.
ఈ సందర్భంగా సినిమాకు సంబందించిన ట్రైలర్ రిలీజ్ చేశారు. మౌనంగా బాధల్ని భరిస్తా.. మూర్ఖంగా ప్రాణాల్ని తీసేస్తా అంటూ బాలయ్య చెప్పే డైలాగ్ నందమూరి ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది. నందమూరి ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్ ఇచ్చేలా ఈ సినిమా ఉంటుందని ట్రైలర్ టీజర్స్ చూస్తేనే అర్ధమవుతుందని.. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని అంటున్నారు. నయనతార, హరిప్రియ, నటాషా దోషి హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకు చిరంతన్ భట్ మ్యూజిక్ అందించారు.