
జన హృదయాలను గెలిచే నాయకుడు అంటే కేవలం తనకు ఇచ్చిన కర్తవ్యాన్ని మాత్రమే చేయడం కాదు.. తనకు తానుగా కొంత సామాజిక దృక్పథంతో ఆలోచించాలి. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అన్న ఆలోచనలో ఉన్న ప్రజలకు రాజకీయ నాయకులు నిజంగానే కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకుంటారు అని మరోసారి నిరూపించారు కేటిఆర్. తండ్రికి తగ్గ తనయుడిగా పాలిటిక్స్ తో తిరుగులేని శక్తిగా అవతరిస్తున్న కేటిఆర్ ఇప్పుడు మరోసారి తన మంచి మనసుని చాటుకున్నారు.
కొద్దిరోజులుగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న సీనియర్ కమెడియన్ గుండు హనుమంతురావు ఆపరేషన్ ఖర్చు నిమ్మిత్తం 5 లక్షల రూపాయలను సిఎం రిలీఫ్ ఫండ్ నుండి అందేలా చేశారు కేటిఆర్. జూబ్లి హిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గుండుకి మెగాస్టార్ చిరంజీవి 2 లక్షల ఆర్ధిక సాయం అందించగా.. పూర్తిగా నయం అయ్యేందుకు అది సరిపోదని తెలిసి మా అసోశియేషన్ సహాయంతో తెలంగాణా మంత్రి కెటిఆర్ కు ఈ విషయాన్ని తెలిపారు. వెంటనే స్పందించిన కెటిఆర్ సిఎం రిలీఫ్ ఫండ్ నుండి 5 లక్షలు అందేలా ఆర్డర్స్ పాస్ చేశారు. ఈ సర్క్యులర్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు కె.టి.ఆర్.
గుండు హనుమంతు రావుకి కెటిఆర్ అందించిన ఈ సహాయానికి నెటిజెన్లు కెటిఆర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చేసింది చిన్న పాత్రలే అయినా గుండు హనుమంతు రావుని తెలుగు ప్రేక్షకులు ఎప్పటికి గుర్తుంచుకుంటారు. ప్రస్తుతం చేతిలో సినిమాలు కూడా లేకపోవడంతో ఆయన ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారు.