62 గెటప్పుల్లో బాలకృష్ణ సంచలనం..!

నందమూరి బాలకృష్ణ హీరోగా తేజ డైరక్షన్ లో ఎన్.టి.ఆర్ బయోపిక్ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో బాలయ్య బాబు ఏకంగా 62 గెటప్ల్లో కనిపిస్తాడని తెలుస్తుంది. ప్రస్తుతం సంక్రాంతికి జై సింహాగా రాబోతున్న బాలకృష్ణ ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఎన్.టి.ఆర్ బయోపిక్ విశేషాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. సినిమాలో 62 గెటప్పుల్లో కనిపిస్తానని చెప్పిన బాలయ్య అన్ని గెటప్పులు ఒకే పాత్రకు సంబందించినవని అన్నారు.

ఇక కె. ఎస్ రవికుమార్ డైరక్షన్ లో వస్తున్న జై సింహా మీద బాలకృష్ణ భారీ హోప్స్ పెట్టుకున్నాడు. సి.కళ్యాణ్ నిర్మించిన ఈ సినిమాలో నయనతార, హరిప్రియ, నటాషా దోషి హీరోయిన్స్ గా నటించారు. చిరంతన్ భట్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా సంక్రాంతి బరిలో 12న రిలీజ్ అవుతుంది. సంక్రాంతి సెంటిమెంట్ తో భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచనాలు సృష్టిస్తుందో చూడాలి.