
సీనియర్ హీరోయిన్స్ లో రమ్యకృష్ణది సెపరేట్ స్టైల్ అని చెప్పొచ్చు. ఇప్పటికి సినిమాలు చేస్తున్నా ఆమెకు ఉండే గుర్తింపు ఆమెకు ఉంటుంది. ఇక బాహుబలిలో రాజమాతగా రమ్యకృష్ణ అభినయం ఎంతటి సంచలనమో తెలిసిందే. ప్రస్తుతం సూర్య హీరోగా విఘ్నేష్ శివన్ డైరక్షన్ లో వచ్చిన గ్యాంగ్ సినిమాలో రమ్యకృష్ణ స్పెషల్ రోల్ ప్లే చేశారు. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకున్న ఈ సినిమా వేడుకలో రమ్యకృష్ణ నా హీరోయిన్ అనేశారు ముఖ్య అతిథిగా వచ్చిన అల్లు అరవింద్.
ఇప్పటికి చాలామంది ఒకప్పటి హీరోయిన్స్ సినిమాలు చేస్తున్న రమ్యకృష్ణలా ఎవరు చేయలేదని అన్నారు అల్లు అరవింద్. ఆమె ఎంత సక్సెస్ అయ్యిందో ఆమె ప్రత్యేక పాత్రలు చేసిన సినిమాలు చూస్తే అర్ధమవుతుందని అన్నారు. సూర్య కూడా బాహుబలి రాజమాతగా రమ్యకృష్ణ అభినయానికి తాను ఫిదా అయినట్టు తెలిపారు. ఆమె పక్కన నటించడానికి కాస్త భయపడ్డానని కూడా అనడం విశేషం. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ గ్యాంగ్ సినిమా జనవరి 12న రిలీజ్ అవుతుంది. జై సింహా రిలీజ్ నాడే వస్తున్న ఈ గ్యాంగ్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.