క్రైం కథతో అర్జున్ రెడ్డి డైరక్టర్..!

లాస్ట్ ఇయర్ అర్జున్ రెడ్డి సినిమాతో చిన్న సినిమా సత్తా ఏంటో చూపించిన సందీప్ రెడ్డి తన తర్వాత సినిమాకు కొద్దిపాటి గ్యాప్ తీసుకోగా ఫైనల్ గా ఓ క్రైం కథతో సినిమాకు సిద్ధమవుతున్నాడట. మర్డర్లు చేసుకుంటూ వెళ్లే ఓ కిరాతకుడిని పట్టుకునే కథతో ఈ సినిమా ఉంటుందట. సందీప్ రెడ్డి ఈ కథను కూడా పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లేతో తెరకెక్కిస్తున్నాడట. 

అయితే ఈ సినిమాలో ఓ స్టార్ హీరో నటిస్తాడని టాక్. ముగ్గురు స్టార్స్ కు ఈ కథ వినిపించాలని చూస్తున్నాడట సందీప్ వంగ. వారిలో ఎవరు ఓకే చేస్తే వారితో ఈ సినిమా చేస్తాడట. మొత్తానికి సందీప్ రెడ్డి మరో ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ కు సిద్ధమవుతున్నాడని తెలుస్తుంది. త్వరలో ఈ సినిమాకు సంబందిచిన అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ చేస్తారట. కచ్చితంగా అర్జున్ రెడ్డి లానే ఈ సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు.