
అక్కినేని ఫౌండేషన్ కు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ద్వారా జాతీయ అవార్డులను ప్రదానం చేస్తూ.. కొన్ని సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. అయితే దేశవ్యాప్తంగా నిర్వహించే ఎన్జీవోల ఐటీ రిటర్న్స్ సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించగా ఇచ్చిన గడువులో ఐటి రిటర్న్స్ సమర్పించకపోవడంతో అక్కినేని ఫౌండేషన్ ఫారిన్ కంట్రిబ్యూషన్ రిజిస్ట్రేషన్ యాక్ట్(ఎఫ్‌సీఆర్ఏ) గుర్తింపుని రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం.
వేటు వేసిన ఎన్జీవో సంస్థల్లో తెలంగాణాకు రాష్ట్రానికి 190 సంస్థలు ఉండగా.. ఆంధ్రప్రదేశ్ కు చెందిన 450 సంస్థలు ఉన్నట్టు తెలుస్తుంది. వాటన్నిటి గుర్తింపుని రద్దు చేస్తూ జాబితా రిలీజ్ చేశారు. 2012 తర్వాత నుండి అవార్డులను ఇవ్వలేదని తెలుస్తుంది. అక్కినేని పేరు మీద నిర్వహిస్తున్న ఈ సంస్థకు సంబందించిన వ్యవహారాలు ప్రభుత్వం కోరిన విధంగా ఇవ్వనందునే ఈ వేటు పడిందని తెలుస్తుంది. మరి ఈ విషయంపై నాగార్జున ఎలా స్పందిస్తారో చూడాలి.