
నాచురల్ స్టార్ నాని నిర్మాతగా చేస్తున్న మొదటి ప్రయత్నం అ!. ప్రశాంత్ వర్మ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా లో భారీ స్టార్ కాస్ట్ స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. కాజల్, రెజినా, నిత్యా మీనన్, ఈషా రెబ్బాలతో పాటుగా అవసరాల శ్రీనివాస్, ప్రియదర్శి, మురళి శర్మ నటిస్తున్నారు. ఇక వీరే కాకుండా ఇందులో నాని చేపగా.. మాస్ మహరాజ్ రవితేజ ఓ చెట్టుగా కనిపిస్తున్నాడు.
రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. సినిమా టీజర్ తోనే ఇది రెగ్యులర్ సినిమా కాదు అని భావన కలిగేలా చేశాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. నాని నిర్మాతగా తన టేస్ట్ ఏంటో చూపించేలా వస్తున్న ఈ అ! కచ్చితంగా మంచి ప్రయత్నమే అని చెప్పాలి. టీజర్ అయితే డిఫరెంట్ గా ఉంది. ఇక సినిమా కూడా అలానే ప్రయోగాత్మకంగా ఉంటే సినిమా సక్సెస్ అయినట్టే. ఫిబ్రవరి రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమాతో నిర్మాతగా కూడా నాని హిట్ కొడతాడని ఆశిద్దాం.