అమెరికాలో అజ్ఞాతవాసి.. అందరికి కృతజ్ఞతలు..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న అజ్ఞాతవాసి సినిమా ప్రపంచవ్యాప్తంగా జనవరి 10న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా అమెరికాలోనే 570 లొకేషన్స్ లో రిలీజ్ అవుతుంది. అమెరికాలో ఇంత భారీ స్థాయిలో రిలీజ్ అవుతున్న మొదటి ఇండియన్ సినిమా అజ్ఞాతవాసి. ఇక దీని గురించి ప్రస్తావిస్తూ పవన్ ఓ వీడియో మెసేజ్ అందించాడు. ఉంటున్న ఊరుని వదిలి పక్క ఊరు వెళ్లి పని చేయాలంటేనే కష్టమని అలాంటిది వేరే దేశం వెళ్లి అక్కడ స్థానికత సంపాదించడం గొప్ప విషయమని అన్నారు పవన్.

దేశం కాని దేశంలో చదువుకోవడం.. ఉద్యోగం చేయడం చాలా కష్టం.. అక్కడ స్థానికత సాధించి గౌరవంగా జీవిస్తున్న మీరంటే తనకి గౌరవమని అన్నారు పవన్. ఇదవరకు బద్రి సినిమాలో అమెరికాలో తక్కువ థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. అక్కడ ఆ సినిమా విజయం సాధించిందని.. ఇప్పుడు అజ్ఞాతవాసి అమెరికాలో భారీ స్థాయిలో రిలీజ్ అవుతుందని మీరు చూపిస్తున్న అభిమానానికి నా ధన్యవాదాలు అంటూ ప్రత్యేక వీడియో రిలీజ్ చేశాడు పవన్ కళ్యాణ్.