
24 చిత్రం విజయానుభూతిని ఎక్కువ రోజులు అనుభవించక ముందే, సూర్య తన తదుపరి సినిమా విషయాలను చెబుతున్నాడు. సింగం సిరీస్ లో మూడో భాగంగా రూపుదిద్దుకుంటున్న సినిమా 'ఎస్3', ఆగస్టులో విడుదల చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్ నుండి సమాచారం. ఇప్పటికే 80 శాతం పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, శరవవేగంగా ముందుకు సాగుతుంది, జూలై రెండో వారంలో భారీ స్థాయిలో ఆడియో విడుదల చేయనున్నారు.
ఎస్3 సినిమా చాలా భాగం విదేశాల్లో చిత్రీకరించడంతో, సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఉంటుందని, సూర్య అభిమానుల అంచనా. ఇంతకు ముందుకన్నా పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో సూర్య ఎస్3 లో కనిపిస్తాడని సమాచారం. మొదటి రెండు భాగాలకు, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, ఈసారి హ్యారిస్ జయరాజ్ ఆ భాధ్యతలను స్వీకరించారు. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ సినిమాలో అనుష్కతో పాటు, శ్రుతి హాసన్ కూడా హీరోయిన్ గా నటిస్తోంది, ఎప్పటిలాగే, ఈ మూడో భాగానికి కూడా హరి దర్శకత్వం వహిస్తారు.