సంక్రాంతి వీరికి చాలా స్పెషల్..!

సంక్రాంతి వస్తుంది అంటే సినిమాల సందడి మొదలైనట్టే. వారం రోజులు హాలీడేస్ ఉండటంతో ప్రేక్షకులను అలరించడానికి స్టార్స్ కూడా వచ్చేస్తుంటారు. ఈ సంక్రాంతికి పవన్ అజ్ఞాతవాసి, బాలకృష్ణ జై సింహాతో వస్తుండగా రాజ్ తరుణ్ రాజుగాడు కూడా సంక్రాంతికి వస్తున్నాడు. ఇక వీరితో పాటుగా సూర్య డబ్బింగ్ మూవీ గ్యాంగ్ కూడా పోటీలో నిలుస్తుంది. తమిళంలో తానా సేంద కూట్టం టైటిల్ తో వస్తున్న ఈ సినిమాను విఘ్నేష్ శివన్ డైరెక్ట్ చేశారు.

అయితే ఈ సంక్రాంతి సీజన్ లో కీర్తి సురేష్, అనిరుద్ కలకు చాలా స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే తెలుగులో వీరి రెండు సినిమాలు సంక్రాంతి బరిలో దిగుతున్నాయి. పవన్ అజ్ఞాతవాసిలో కీర్తి సురేష్ హీరోయిన్ కాగా అనిరుద్ మ్యూజిక్ అందించాడు. ఇక సూర్య గ్యాంగ్ సినిమాలో కూడా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా ఆ సినిమాకు అనిరుద్ మ్యూజిక్ అందించడం జరిగింది. మొత్తానికి సంక్రాంతి స్పెషల్ గా వస్తున్న రెండు క్రేజీ మూవీస్ లో కీర్తి సురేష్, అనిరుద్ కామన్ అవ్వడం విశేషం.