మంచు ఫ్యామిలీలో వారసుడు వచ్చాడు..!

మంచు ఫ్యామిలీలోకి మరో వారసుడు ఎంట్రీ ఇచ్చాడు. హీరోగా మరో మంచు కుర్రాడు వస్తున్నాడా అని అనుకోవచ్చు. ఇక్కడ విషయం ఏంటంటే మంచు విష్ణు, విరనికాలకు బాబు పుట్టాడు. 2008లో పెళ్లిచేసుకున్న ఈ విష్ణు, విరానికాలకు 2011లో కవలలు పుట్టారు. వారికి అరియానా విరియానా పేర్లు పెట్టారు. పుట్టబోయే బిడ్డ అబ్బాయే కానవసరం లేదు తనకు మళ్లీ అమ్మాయి కావాలని విష్ణు అన్నాడు.. కాని అతనికి వారసుడు పుట్టాడు. అయితే దీనిపై స్పందించిన విష్ణు అబ్బాయితో పాటు కూతుళ్లు కూడా తనకు వారసులే అంటున్నాడు.

జనవరి 1న మంచు ఫ్యామిలీలో సంతోషం రెండింతలు అయ్యింది. ఓ పక్క న్యూ ఇయర్ రావడమే కాకుండా మంచు ఫ్యామిలీలో వారసుడు కూడా పుట్టాడు. ప్రస్తుతం గాయత్రి సినిమాలో నటిస్తున్న మంచు విష్ణు మరో పక్క ఓటర్ గా కూడా వస్తున్నాడు. మదన్ డైరక్షన్ లో వస్తున్న గాయత్రి సినిమాలో కలక్షన్ కింగ్ మోహన్ బాబు లీడ్ రోల్ చేస్తుండటం విశేషం.