అల్లరి నరేష్ కు షాక్ ఇస్తున్న 'జంబలకిడిపంబ'..!

ఈవివి సత్యనారాయణ డైరక్షన్ లో వచ్చిన జంబలకిడిపంబ సినిమా ఎంత పెద్ద సూపర్ హిట్టో అందరికి తెలిసిందే. ఈవివి మార్క్ సినిమాగా వచ్చిన ఈ సినిమాలో ఏ సీన్ చూసినా కడుపు చెక్కలయ్యేలా నవ్వే ఆడియెన్స్ ఉన్నారు. అయితే ఆ సినిమా సీక్వల్ గా పంలకిడిజంబ అంటూ ఓ సినిమా చేయాలని అనుకున్నాడు. కథ కూడా అల్లరి నరేష్ పర్యవేక్షణలో సిద్ధం చేస్తున్నాడట.

అయితే ఇంతలో అదే సినిమా టైటిల్ తో జంబలకిడిపంబ అంటూ వస్తున్నాడు శ్రీనివాస్ రెడ్డి. ఈమధ్య లీడ్ రోల్ సినిమాలు చేస్తూ హిట్లు కొడుతున్న శ్రీనివాస్ రెడ్డి మను డైరక్షన్ లో జంబలకిడిపంబ సినిమా చేస్తున్నాడట. రీసెంట్ గా ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లిందని సమాచారం. మరి ఈవివి తనయుడిగా నరేష్ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేకున్నా నరేష్ కు ఓ మాట చెప్పి ఈ టైటిల్ తో సినిమా తీసుంటే బాగుండేదని సలహా ఇస్తున్నారు కొందరు.