మెర్సల్ డైరక్టర్ తో ప్రభాస్.. అంతా రూమరే..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు నేషనల్ స్టార్.. బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ ఊహించని విధంగా మారింది. ప్రస్తుతం సాహో సినిమా చేస్తున్న ప్రభాస్ ఆ తర్వాత తమిళ క్రేజీ డైరక్టర్ అట్లీతో సినిమా చేస్తున్నాడని అంటున్నారు. కోలీవుడ్ లో యువ సంచలనంగా మారిన అట్లీ రీసెంట్ గా విజయ్ తో మెర్సల్ సినిమా చేశాడు. అట్లీ తర్వాత తెలుగు హీరో ప్రభాస్ తో సినిమా చేస్తాడని అన్నారు.

ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది. కోలీవుడ్ టాక్ ప్రకారం అట్లీ తవాత సినిమా కూడా తమిళ స్టార్ హీరో చేస్తున్నాడట. రాజు రాణి తర్వాత వరుసగా రెండు సినిమాలు విజయ్ తో చేసిన అట్లీ దర్శకుడిగా ఓ రేంజ్ సంపాదించాడు. భారీ బడ్జెట్ సినిమాలైనా సరే మినిమం గ్యారెంటీ రిజల్ట్ తో క్రేజ్ సంపాదించిన ఈ డైరక్టర్ ప్రభాస్ సినిమా మాత్రం చేయట్లేదని తెలుస్తుంది.