
సూపర్ స్టార్ రజినికాంత్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా 2.ఓ. రోబో సీక్వల్ గా వస్తున్న ఈ సినిమా 450 కోట్ల భారీ బడ్జెట్ తో రాబోతుంది. అక్షయ్ కుమార్ ఈ సినిమాలో విలన్ గా నటించడంతో సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. ఈ సినిమా జనవరి 26 నుండి పోస్ట్ పోన్ కాగా అసలు రిలీజ్ డేట్ ఏంటన్నది మాత్రం రివీల్ చేయలేద్.
ఫైనల్ గా ఏప్రిల్ 27న 2.ఓ సినిమా రిలీజ్ అన్నారు. కాని ఇప్పుడు ఏకంగా సినిమా హీరో రజినికాంత్ సినిమా రియల్ రిలీజ్ డేట్ చెప్పాడు. రీసెంట్ గా అభిమానులతో తరచు మీటింగులను ఏర్పాటు చేసుకుంటున్న రజినికాంత్ ఏప్రిల్ 14న 2.ఓ రిలీజ్ ఉంటుందని చెప్పేశాడుట. సో ఆ సినిమాతో ముడిపడి రిలీజ్ ఆపుకున్న మహేష్, అల్లు అర్జున్ సినిమాలకు లైన్ క్లియర్ అయినట్టే అంటున్నారు.