
ప్రస్తుతం ఏమాత్రం ఫాంలో లేని అల్లరి నరేష్, కమెడియన్ నుండి హీరోగా టర్న్ తీసుకున్న సునీల్ ఇద్దరు కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా ప్లాన్ చేశారు. భీమనేని శ్రీనివాస్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా సుడిగాడు-2 అని ప్రచారం జరుగుతుంది. అయితే ఆ సినిమాకు నిజంగా సీక్వల్ గా వస్తుందా లేదా అన్నది మాత్రం తెలియలేదు. ఇక ఈ సినిమాలో అల్లరి నరేష్, సునీల్ సరసన రకుల్, లావణ్య త్రిపాఠి లాంటి క్రేజీ భామలను అడుగుతున్నారట.
ఫాంలో లేని ఈ ఇద్దరి పక్కన ఆ ఇద్దరు నటిస్తారా అన్న డౌట్ రాక మానదు. అల్లరి నరేష్, సునీల్ ఈ ఇద్దరికి ఇది చాలా ఇంపార్టెంట్ మూవీ. ఇక ఇదే కాకుండా అల్లరి నరేష్ మహేష్ వంశీ పైడిపల్లి సినిమాలో స్పెషల్ రోల్ లో కనిపిస్తాడని అంటున్నారు. సునీల్ కూడా మళ్లీ కమెడియన్ గా కొనసాగాలని అనుకుంటున్నాడట. మొత్తానికి నరేష్, సునీల్ ఎలాంటి సినిమాతో వస్తారో చూడాలి.