నాగార్జున కూడానా.. ఇదో రకం ట్రెండ్..!

ప్రయోగాలకు ఎప్పుడు ముందుంటే నాగార్జున ఈసారి కొత్తగా వెబ్ సీరీస్ పై దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఇప్పటికే స్టార్స్ అంత వెబ్ సీరీస్ లపై మోజు పెంచుకోగా ఇప్పుడు ఆ దారిలో నాగార్జున కూడా నడుస్తున్నాడట. మంచు లక్ష్మి ప్రేరణతో నాగార్జున వెబ్ సీరీస్ చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఇప్పటికే రానా సోషల్ అంటూ ఓ వెబ్ సీరీస్ చేయగా.. త్వరలో బాబాయ్ తో మరో వెబ్ సీరీస్ మొదలు పెడతాడని అంటున్నారు.

ఇక ఇప్పుడు నాగార్జున కూడా వెబ్ సీరీస్ ట్రెండ్ కొనసాగించబోతున్నాడు. ఈ వెబ్ సీరీస్ కు అవసరాల శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తాడని తెలుస్తుంది. ఇక సినిమాల విషయానికొస్తే వర్మతో సినిమా మొదలు పెట్టిన నాగార్జున మరో సినిమా కమిట్ అవ్వలేదు. మరి వెబ్ సీరీస్ లో అడుగు పెడుతున్న నాగ్ అక్కడ ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తారో చూడాలి. నాగర్జున ఒకవేళ ఈ వెబ్ సీరీస్ లో నటించనని చెబితే అతని ప్లేస్ లో సుమంత్ ను తీసుకోవాలని చూస్తున్నారు.