
మెగా అల్లుడు కళ్యాణ్ హీరోగా పరిచయమవబోతున్నాడు. రాకేష్ శశి డైరక్షన్ లో ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. అతను కొత్త దర్శకుడని అన్నారు కాని ఆల్రెడీ మనవాడు జతకలిసే అనే సినిమా తీశాడని తెలుస్తుంది. ఇక కళ్యాణ్ తో చేసే సినిమా కథను ఆల్రెడీ నిఖిల్ కు వినిపించాడట. నిఖిల్ ఎందుకో ఆ కథ తనకు వర్క్ అవుట్ కాదని చెప్పాడట. ఫైనల్ గా నిఖిల్ కాదన్న కథతో కళ్యాణ్ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాను సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సినిమా కథ విన్నారని తెలుస్తుంది. మరి ఓ హీరో కాదన్న కథను చిరు ఎలా ఓకే చేశాడంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఫాదర్ సన్ మధ్య జరిగే సెంటిమెంటల్ మూవీగా ఈ సినిమా ఉంటుందట. మొత్తానికి అల్లుడిని ఫ్యామిలీ హీరో చేయాలన్న మెగాస్టార్ కోరిక ఏమేరకు ఫలిస్తుందో చూడాలి.