ఇందుకే కేటిఆర్ వెరీ స్పెషల్..!

రాజకీయవేత్తలంటే కేవలం రాజకీయాలకు సంబందించిన విషయాలను ప్రస్తావించడం.. ప్రభుత్వ కార్యక్రమాలను సరిగా ఉండేలా చూసుకోవడం. అయితే ఇది అందరు చేసేదే కాని తెలంగాణా ఐటి, పంచాయతీరాజ్ శాఖా మంత్రి కేటిఆర్ మాత్రం వెరీ స్పెషల్ అని చెప్పొచ్చు. అలా ఎందుకు అంటే తెలంగాణా సమగ్ర పాలనలో కెసిఆర్ అధ్యక్షతన సమర్ధవంతమైన పరిపాలనను కొనసాగిస్తుండగా ఎప్పుడు నెటిజెన్లకు అందుబాటులో ఉంటూ వారితో ప్రత్యక్షంగా సంభాషించడం అనేది గొప్ప విషయం.. అది కేవలం కెటిఆర్ వల్లే అవుతుందని మరోసారి ప్రూవ్ చేశారు.   

రీసెంట్ గా కేటిఆర్ రెండు గంటల పాటు ట్విట్టర్ లో నెటిజెన్లతో సంభాషణలు జరిపాడు కె.టి.ఆర్. రాజకీయ అంశాలే కాదు ప్రభుత్వ పాలనకు సంబందించిన విషయాలను కూడా ఇందులో ప్రస్తావించారు. ఇక సినిమా గ్లామర్ ప్రపంచానికి సంబందించిన విషయాలను కూడా ప్రస్తావించడం జరిగింది. ఇక అభిమానులు తమ హీరోల గురించి అడుగగా ఓపిగ్గా సమాధానం ఇచ్చారు కేటిఆర్. అల్లు అర్జున్ స్టైలిష్ అన్న కేటిఆర్.. మహేష్ సూపర్ స్టార్ అని అన్నారు. ప్రభాస్ బాహుబలి అంటూ చెప్పుకు రాగా.. ఎన్టీఆర్ ఒక పర్ఫార్మర్ అని సమాధానం ఇచ్చారు. ఇక పవన్ గురించి అడుగగా ఎనిగ్మా అని అన్నారు.. అంటే అర్ధం చేసుకోడానికి కష్టమైన వ్యక్తి. ఇక పవన్ రాజకీయ జీవితాన్ని గురించి అడిగితే అది ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. మొత్తానికి నెటిజెన్లతో చాటింగ్ తో కేటిఆర్ మరోసారి తానెంత స్పెషల్ అన్నది రుజువుచేశారు.