2018 రెండు సినిమాలు పక్కానా..!

సూపర్ స్టార్ మహేష్ ఇయర్ కు ఒక సినిమా రిలీజ్ చేసేందుకే కష్టపడుతుంటే 2018 సంవత్సరంలో మహేష్ పక్కాగా రెండు సినిమాలు రిలీజ్ చేస్తాడని తెలుస్తుంది. ప్రస్తుతం కొరటాల శివ డైరక్షన్ లో భరత్ అను నేను సినిమా షూటింగ్ లో ఉండగా ఇక మహేష్ 25వ సినిమాగా రాబోయే వంశీ పైడిపల్లి సినిమా కూడా 2018 రిలీజ్ పక్కా అంటున్నారు.

కొరటాల శివ ఏప్రిల్ 13 లేదా 27 తారీఖులలో వచ్చే అవకాశం ఉండగా సమ్మర్ లో స్టార్ట్ అయ్యే మహేష్ 25వ సినిమా మాత్రం దసరాకి రిలీజ్ చేసేలా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట. అశ్వనిదత్, దిల్ రాజు కలిసి నిర్మించే సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతుందట. మరి నిజంగానే మహేష్ 2018 లో రెండు సినిమాలను రిలీజ్ చేస్తే ఫ్యాన్స్ కు అంతకుమించిన గుడ్ న్యూస్ మరోటి ఉండదు.