
మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ హీరోగా వినాయక్ డైరక్షన్ లో వస్తున్న సినిమా ధర్మా భాయ్. ఖైది నంబర్ 150 తర్వాత వినాయక్ చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే ఈ సినిమాలో సుప్రీం హీరో మెగా సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది. సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీం సినిమాలు సాయి ధరం తేజ్ కెరియర్ లో మంచి హిట్ సినిమాలుగా నిలిచాయి.
ఆ సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి పాటలను రీమిక్స్ చేశాడు సాయి ధరం తేజ్. ఇప్పుడు అదే సెంటిమెంట్ ను తన తర్వాత సినిమాకు రిపీట్ చేస్తున్నాడు. వినాయక్ తో చేస్తున్న సినిమాలో కొండవీటి దొంగ సినిమాలో ఛమక్ ఛమక్ ఛాం పాటను రీమిక్స్ చేస్తున్నాడట. ఇళయరాజా స్వరపరచిన ఆ సాంగ్ ఎంత పెద్ద హిట్టో అందరికి తెలుసు. చిరంజీవి విజయశాంతిలు కలిసి చేసిన ఈ పాట ఆ సినిమాలో సూపర్ హిట్ సాంగ్.. మరి ఆ సాంగ్ ను రీమిక్స్ చేస్తూ తేజ్ చేస్తున్న ఈ సినిమా కూడా అదే రేంజ్ హిట్ అవుతుందో లేదో చూడాలి.