
భానుమతి ఒక్కటే పీస్.. హైబ్రిడ్ పిల్ల అంటూ ఫిదాతో తెలుగు ప్రేక్షక హృదయాలను ఫిదా అయ్యేలా చేసిన సాయి పల్లవి ఆ తర్వాత నానితో చేసిన ఎం.సి.ఏ సినిమాతో కూడా హిట్ దక్కించుకుంది. అయితే నాని సినిమా హిట్ లో ఆమె క్రేజ్ తక్కువే అయినా ఓవరాల్ గా తెలుగులో మరో హిట్ అందుకుంది సాయి పల్లవి. ఇక ఇదే ఫాంతో మరో క్రేజీ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట అమ్మడు.
వరుస హిట్లతో దూసుకెళ్తున్న శర్వానంద్ హీరోగా హను రాఘవపుడి డైరక్షన్ లో వస్తున్న సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి కన్ఫాం అయ్యిందట. లై ఫ్లాప్ అయినా డైరక్టర్ హను చెప్పిన నరేషన్ కు సాయి పల్లవి ఫిదా అయ్యిందట. అందుకే అమ్మడు సినిమాకు ఓకే చెప్పిందట. భానుమతి ఎకౌంట్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్ వచ్చి చేరింది. మరి ఈ సినిమా అమ్మడికి ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి.