చైతు సవ్యసాచి.. భూమిక లక్కీ చాన్స్..!

మహేష్, ఎన్.టి.ఆర్, పవన్ కళ్యాణ్ లతో కలిసి హీరోయిన్ గా నటించిన భూమిక హీరోయిన్ గా అమ్మడు కెరియర్ ముగింపు పలికినా రీ ఎంట్రీలో ఆమె క్యారక్టర్ ఆర్టిస్టుగా క్రేజ్ తెచ్చుకుంది. రీసెంట్ గా నాని ఎం.సి.ఏ లో వదినగా భూమిక చేసిన పాత్ర ప్రేక్షకులను అలరించింది. వదినగా ప్రతి ఇంటికొచ్చి పలుకరించిన ఆమె నటన ఆకట్టుకోగా ఆ సినిమాతో భూమిక మళ్లీ క్రేజ్ తెచ్చుకుంది.

ఇక నాని సినిమా రిలీజ్ అయ్యి హిట్ కాగానే నాగ చైతన్య సవ్యసాచిలో భూమికకు లక్కీ ఛాన్స్ వరించింది. నానికి వదినగా చేసిన భూమిక చైతుకి అక్క పాత్రలో కనిపించనుంది. చందు మొండేటి డైరక్షన్ లో వస్తున్న సవ్యసాచి మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో కోలీవుడ్ హీరో మాధవన్ విలన్ గా నటిస్తున్నాడు.