బన్ని టీజర్.. మాటల్లేవ్..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ డైరక్షన్ లో వస్తున్న సినిమా నా పేరు సూర్య. లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ న్యూ ఇయర్ కానుకగా రిలీజ్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలో ఈ టీజర్ కు సంబందించిన విషయాలు బయటకు వచ్చాయి. టీజర్ లో డైలాగ్స్ ఏవి లేకుండా వస్తుందట.

కేవలం సీన్స్ తోనే సినిమా మీద ఇంప్యాక్ట్ క్రియేట్ అయ్యేలా చేస్తున్నారట. రచయితగా సూపర్ సక్సెస్ అందుకున్న వక్కంతం వంశీ దర్శకుడిగా చేస్తున్న మొదటి ప్రయత్నం నా పేరు సూర్య. ఈ మాటల్లేని టీజర్ సినిమా మీద ఎలాంటి అంచనాలను పెంచుతుందో చూడాలి. వరుస సక్సెస్ లతో తన స్టామినా పెంచుకుంటూ వస్తున్న బన్ని స్టార్స్ లో హిట్ రేషియో పెంచుకుంటూ వస్తున్నాడు. మరి నా పేరు సూర్య కూడా ఆ రేషియో మరింత పెంచేలా చేస్తుందేమో చూడాలి.