సైరాకు చుక్కలు చూపిస్తుందట..!

మెగాస్టార్ రీ ఎంట్రీ మూవీ ఖైది నంబర్ 150 సూపర్ హిట్ కావడంతో అదో నూతనోత్సాహంతో సైరా నరసింహారెడ్డి సినిమా షురూ చేశాడు మెగాస్టార్. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్లో రాం చరణ్ నిర్మిస్తున్నాడు. 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెలుగు, తమిళ, హింది భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా ఎంపిక చేశారు. 

అయితే తన బిజీ షెడ్యూల్ వల్ల సైరాకు సరిగా డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోతుందట నయన్. సౌత్ లో క్రేజీ బ్యూటీగా మారిన నయనతార కోలీవుడ్ లో లీడ్ హీరోయిన్ గా సినిమాలు చేస్తూ ఫుల్ క్రేజ్ సంపాదించింది. అక్కడ స్టార్ సినిమాలకు ధీటుగా నయనతార సినిమాల కలక్షన్స్ వస్తాయంటే నమ్మాలి. ప్రస్తుతం సైరా యూనిట్ కు నయనతార చుక్కలు చూపిస్తుందట. ఇలానే కొనసాగితే కష్టం కనుక నయనతార ప్లేస్ లో వేరే హీరోయిన్ ను తీసుకోవాలని చూస్తున్నారట.