మాస్ రాజా అతనికి ఛాన్స్ ఇచ్చాడు..!

మాస్ మహరాజ్ రవితేజ రీసెంట్ గా రాజా ది గ్రేట్ సినిమాతో హిట్ అందుకున్నాడని తెలిసిందే. ఈ సినిమా తర్వాత కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో సినిమా కన్ఫాం చేశారు. అయితే ఇప్పుడు మరో సినిమా కూడా పక్కా అంటున్నారు. ఈమధ్యనే నానితో ఎం.సి.ఏ అంటూ హిట్ అందుకున్న శ్రీరాం వేణు డైరక్షన్ లో రవితేజ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. అయితే ఈ కాంబినేషన్ లో సినిమా కొన్నాళ్ల కిందట అనుకుందే 2011లో శ్రీరాం వేణు ఓ మై ఫ్రెండ్ సినిమా తీశాడు ఆ తర్వాత రవితేజతో సినిమా ప్లాన్ చేసినా సెట్స్ మీదకు వెళ్లలేదు.

ఇక ఇప్పుడు నానితో హిట్ కొట్టాడు కాబట్టి శ్రీరాం వేణుతో సినిమాకు సైన్ చేశాడట రవితేజ. ఈ సినిమా కూడా దిల్ రాజు నిర్మాణంలోనే వస్తుందని తెలుస్తుంది. ఎం.సి.ఏ హిట్ తో జోష్ లో ఉన్న శ్రీరాం వేణు రవితేజతో ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి. దిల్ రాజు కాంపౌండ్ నుండి వస్తున్న ఈ సినిమా కాబట్టి కచ్చితంగా ఈ సినిమాపై అంచనాలు ఉన్నట్టే.