అక్కినేని హీరో కథతో మెగా మేనళ్ళుడు..!

కొన్ని సినిమాల కథలు సదరు హీరోలకు నచ్చినా సరే టైం కుదరక మిస్ అవుతూ ఉంటారు. అలా మిస్సైన సినిమాలు ఫ్లాప్ అయితే హమ్మయ్య అనుకుంటారేమో కాని హిట్ అయితే మాత్రం కెరియర్ లో ఓ హిట్ సినిమా మిస్ అయ్యిందని బాధపడుతుంటారు. ప్రస్తుతం ఈ టాపిక్ ఎందుకంటే అక్కినేని హీరో చేయాల్సిన ఓ క్రేజీ మూవీ అతను మిస్ అవగా అది కాస్త మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ చేతికి చిక్కింది.

ఈమధ్యనే జవాన్ తో పర్వాలేదు అనిపించుకున్న తేజ్ ప్రస్తుతం చేస్తున్న సినిమా ధర్మా భాయ్. వివి.వినాయక్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా కథను ఆకుల శివ అందిస్తున్నాడు. అయితే ఈ సినిమా కథ ఇదవరకే అక్కినేని నాగ చైతన్యకు వినిపించాడట. డమరుకం సినిమా టైంలో నాగార్జున శ్రీనివాస్ రెడ్డి డైరక్షన్ లో చైతుతో ఈ కథను తెరకెక్కించాలని చూశాడట. కాని పరిస్థితులు అనుకూలించక ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది.  

అలా చైతు వదిలిన ఈ సబ్జెక్ట్ వినాయక్ విని తేజ్ కు సరిపోయేలా మార్చి సినిమా చేస్తున్నాడట. ఖైది నంబర్ 150 సినిమా తర్వాత వినాయక్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఈ అంచనాలను అందుకునేలా సినిమా ఉంటుందా లేదా అన్నది రిలీజ్ అయితేనే గాని తెలుస్తుంది.