
తెలంగాణా రెవెన్యూ మరియు గ్రామీణ నీటిపారుదల విభాగాలలో మొత్తం1865 పోస్టుల భర్తీకి రాష్ట్ర ఆర్దికమంత్రిత్వ శాఖ శుక్రవారం అనుమతించింది. కనుక త్వరలో వాటి కోసం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) నొతిఫిఎక్శన్ జారీ చేయబోతోంది. రెవెన్యూ శాఖలో 1506 పోస్టులు, గ్రామీణ నీటిపారుదల విభాగంలో మిగిలిన 359 పోస్టులు భర్తీ చేస్తారు. రెండు శాఖల నుంచి వాటి భర్తీకి మార్గదర్శకాలు అందగానే టీఎస్‌పీఎస్సీ తదనుగుణంగా నోటిఫికేషన్ జారీ చేస్తుంది. రెండు విభాగాలలో ఉన్న ఖాళీలు, పోస్టుల సంఖ్య ఈవిధంగా ఉంది:
గ్రామీణ నీటిసరఫరా మరియు పారిశుద్యం విభాగంలో ఖాళీలు:
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు: 277, అసిస్టెంట్ ఇంజనీర్లు:82 పోస్టులు
రెవెన్యూ విభాగంలో ఖాళీలు:
డిప్యూటీ కలెక్టర్లు: 8, డిప్యూటీ తహసిల్దార్లు: 38, జిల్లా రిజిస్ట్రార్లు: 7, వి.ఆర్.వోలు: 700, సబ్ రిజిస్ట్రార్లు: 22 (రిజిస్ట్రేషన్ల శాఖ), జూనియర్ అసిస్టెంట్లు: 50 (రిజిస్ట్రేషన్ల శాఖ), జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులు: 21 (రెవెన్యూ విభాగం), జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులు: 400 (జిల్లా స్థాయిలో), డిప్యూటీ సర్వేయర్లు: 210, కంప్యూటర్ డ్రాఫ్ట్ మ్యాన్లు: 50 పోస్టులు భర్తీ చేయబడతాయి. త్వరలోనే వీటికి సంబంధించి నోటిఫికేషన్ వెలువడుతుంది.