కొన్నేళ్ళ క్రిందట కేరళలో తిరువనంతపురంలో గల అనంతపద్మనాభ స్వామి ఆలయం నేలమాళిగలో ఆరు గదులలో లక్షల కోట్లు విలువచేసే బంగారు, వజ్రవైడూర్యాలు బయటపడిన సంగతి తెలిసిందే. వాటిని గుట్టు చప్పుడు కాకుండా ఇంటి దొంగలు దోచుకుపోతున్నారు. 2015లో ఆలయ రికార్డులు తనికీలు చేసినప్పుడు సుమారు రూ.189 కోట్లు విలువైన 776 కిలోల బంగారు ఆభరణాలు, కోట్లు రూపాయలు ఖరీదు చేసి 8 అపురూపమైన వజ్రాలు మాయం అయినట్లు అధికారులు గుర్తించారు.
2015లో ఈ సంగతి బయటపడిందంటే చాలా కాలం క్రితమే దొంగతనాలు జరిగినట్లు అర్ధం అవుతోంది. వాటిని అంత ఆలస్యంగా గుర్తించడం ఆలయ అధికారుల అశ్రద్ధ, నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. 2015లో ఈ దొంగతనాలను గుర్తిస్తే 2016లో పోలీసులకు పిర్యాదు చేయడం ఈ వ్యవహారంలో వారిని కూడా అనుమానించవలసి వస్తోంది. దీనిపై ఆలయ అధికారులు చెపుతున్న మాటలు వారినే అనుమానించేవిగా ఉన్నాయి. మొదట మాయమైన ఆ వజ్రాలను వేరే చోట భద్రంగా దాచి ఉంచమని చెప్పారు. కానీ కోర్టులో వజ్రాలు దొంగతనం జరిగాయని చెప్పారు.
ఈ బారీ దొంగతనాల గురించి న్యాయమిత్ర గోపాల్ సుబ్రహ్మణ్యం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్ళి అనంతపద్మనాభ స్వామికి చెందిన రూ1.5 లక్షల కోట్లు విలువగల సంపదను దొంగలపాలు కాకుండా కాపాడవలసిందిగా కోరారు. ఆ సంపదను కేంద్రప్రభుత్వం తక్షణం స్వాధీనం చేసుకొని దానిని రిజర్వ్ బ్యాంక్ అధీనంలో ఉంచితే మంచిది. లేకుంటే మరి కొన్నేళ్ళ తరువాత మిగిలిన ఆ సంపద కూడా దొంగలపాలయ్యే ప్రమాదం ఉంది.