భారతీయ రైల్వేశాఖ సరికొత్త ప్రయోగానికి సిద్దం అవుతోంది. దానికి అత్యధికశాతం ఆదాయం సమకూర్చుతున్న సామాన్య ప్రయాణికుల కోసం చవుకలో ఏసీ ప్రయాణం అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. దాని కోసం ప్రత్యేకంగా ఎకానమీ క్లాస్ ఏసీ కోచ్ లు ఏర్పాటుచేయబోతోంది.
వాటిలో కూడా ఏసీ ఉన్నప్పటికీ వాటి టికెట్ ధర థర్డ్ ఏసీ టికెట్ కంటే తక్కువగా ఉంటుందిట. పిండిని బట్టి రొట్టె అన్నట్లుగా టికెట్ ధరను బట్టే సౌకర్యాలు కూడా ఉంటాయి కనుక దానిలో ఉష్ణోగ్రత 24–25 డిగ్రీల మద్య ఉంటుంది. కప్పుకోవడానికి దుప్పట్లు ఇవ్వబడవు. త్వరలోనే కొన్ని ప్రధాన రూట్లలో నడిచే రైళ్ళలో ఈ ఎకానమీ క్లాస్ ఏసీ కోచ్ లను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టడానికి రైల్వేశాఖ సన్నాహాలు మొదలుపెట్టింది. థర్డ్ ఏసీ టికెట్ ధరను భరించలేక ఇంతకాలం స్లీపర్ క్లాసులో ప్రయాణిస్తున్న సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఇది నిజంగానే చాలా చల్లటి కబురే కదా?