నేడు హైదరాబాద్ రానున్న మీరా కుమార్

ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్ధిగా రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్న మీరా కుమార్ నేడు హైదరాబాద్ రానున్నారు. తనకు మద్దతు ఇస్తున్న కాంగ్రెస్, వామపక్షాల నేతలను కలిసేందుకు ఆమె హైదరాబాద్ వస్తున్నారు. ఆమె మధ్యాహ్నం 12 గంటలకు గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేతలతో సమావేశం అవుతారు. తరువాత మీడియా ప్రతినిధులతో సమావేశం అవుతారు. తరువాత నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ భవనంలో కాంగ్రెస్, వామపక్ష నేతలు, ప్రజాప్రతినిధులు, నగరంలోని ప్రముఖులతో కలిసి భోజన సమావేశంలో పాల్గొంటారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీని కలిసి మీరా కుమార్ కు మద్దతు ఇవ్వవలసిందిగా అభ్యర్ధించారు కనుక మజ్లీస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఈ విందు సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశం పూర్తయిన తరువాత మీరా కుమార్ మళ్ళీ డిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు.