ఎస్సైగారు జర భద్రం!

సిద్ధిపేట జిల్లాలో కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా చేస్తున్న ప్రభాకర్ సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకోవడంతో ఆయన స్థానంలో సంతోష్ కుమార్ నియమితులయ్యారు. ప్రభాకర్ కు ముందు అదే స్టేషన్ లో ఎస్సైగా పనిచేసిన రామకృష్ణారెడ్డి ఉన్నతాధికారుల వేధింపులు భరించలేక తనసర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకొన్నారు. ఈ విషాదకర సంఘటనల నేపధ్యంలో వారి స్థానంలో భాద్యతలు స్వీకరించిన సంతోష్ కుమార్ ఎటువంటి సమస్యలు ఎదురైనా వాటిని నిబ్బరంగా ఎదుర్కోవలసిన అవసరం ఉంది. అవసరమైతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్ళడం మంచిది.