జూన్ 21 నుంచి అమరుల స్ఫూర్తి యాత్ర

టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ జూన్ 21 నుంచి అమరుల స్ఫూర్తి యాత్ర పేరిట తెలంగాణా రాష్ట్ర పర్యటనకు బయలుదేరుతున్నారు. మొదటిదశ యాత్ర సంగారెడ్డి నుంచి మొదలుపెడతారు. ఈ యాత్ర ద్వారా రాష్ట్ర ప్రజల సమస్యలు తెలుసుకోవడం, తెరాస సర్కార్ చేపడుతున్న ప్రాజెక్టులు, అమలుచేస్తున్న పధకాల అమలవుతున్న తీరును ప్రొఫెసర్ కోదండరామ్ పరిశీలిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా సాగే ఈ యాత్రకు టిజెఎసి నాయకులు, కార్యకర్తలు అవసరమైన సన్నాహాలు చేస్తున్నారు. ఈ యాత్రలో ప్రొఫెసర్ కోదండరామ్ ఎక్కడికక్కడ ప్రజలతో, మీడియా ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తారు. 

మొదటి నాలుగు రోజులలో ఆయన సదాశివపేట, కోహీర్, జహీరాబాద్, గంగ్వార్ చౌరస్తా, నారాయణ్ ఖేడ్, ఆందోల్, జోగిపేట, నర్సాపూర్, కౌడిపల్లి, మెదక్, శంకరంపేట, నార్సింగి, రామాయంపేట, నిజాం పేట, భూంపల్లి క్రాస్ రోడ్స్,  తిమ్మాపూర్, దుబ్బాక, సిద్ధిపేట తదితర ప్రాంతాలలో పర్యటిస్తారు.