గుంటూరులో నిన్న జరిగిన కాంగ్రెస్ సభలో రాహుల్ గాంధీ ఏపి సి.ఎం. చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. “జాతీయ ప్రాజెక్టుగా ప్రకటింపబడిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చు అంత కేంద్రప్రభుత్వమే భరిస్తుందని మేము వాగ్దానం చేస్తే, చంద్రబాబు నాయుడు అది మాకు అక్కరలేదని చెప్పి స్వయంగా దాని నిర్మాణ బాధ్యతలు తీసుకొన్నారు. ఆ ప్రాజెక్టును కేంద్రమే నిర్మిస్తే ఆయనకు కమీషన్లు రావు అందుకే కమీషన్లకు కక్కుర్తిపడి పోలవరాన్ని చేపట్టారు. దాని వలన రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతోందని తెలిసినా అయన తన స్వార్ధ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రత్యేక హోదా వస్తే ఏపికి చాలా మేలు కలుగుతుందంటే అది కూడా అక్కరలేదని చెప్పి కేంద్రం నుంచి ‘ప్యాకేజి’ పుచ్చుకొన్నారు,” అని రాహుల్ గాంధీ విమర్శించారు.