అధికార లాంఛనాలతో దాసరి అంత్యక్రియలు

ప్రముఖ సినీ దర్శకుడు, నటుడు, నిర్మాత, రచయిత దాసరి నారాయణ రావు మృతి పట్ల తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. దాసరి అంత్యక్రియలు అధికారిక లాంచనాలతో జరిపించాలని ఆదేశించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దాసరి నివాసానికి వచ్చి నివాళులు అర్పించారు. 

పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు దాసరి నివాసానికి వచ్చి ఆయనతో తమకున్న అనుబందాన్ని తలుచుకొని కన్నీరు పెట్టుకొంటున్నారు.   

దాసరి మృతికి సంతాపంగా మూడు రోజులు సినిమా షూటింగులు నిలిపివేస్తారు. విదేశాలలో షూటింగ్ కార్యక్రమాలు కూడా నిలిపివేస్తారు. ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా థియేటర్లను కూడా మూసివేస్తారు. 

దాసరి పార్దివ శరీరాన్ని ఉదయం 10.30 గంటలకు ఫిలిం నగర్ లోని ఫిలిం ఛాంబర్ కు తరలిస్తారు. అక్కడి నుంచి చేవెళ్ళలో దాసరి కుటుంబానికి చెందిన పద్మ గార్డెన్స్ లో అంత్యక్రియలు నిర్వహించి అక్కడ ఆయన భార్య సమాధి పక్కనే దాసరి సమాధి నిర్మిస్తారు.