ఈరోజు తెలంగాణా భవన్ లో జరిగిన తెరాస నేతలు, ప్రజా ప్రతినిధుల సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేల పనితీరుపై నియోజకవర్గాల వారిగా నివేదికను బయటపెట్టారు. దీనిలో ఆయన ప్రాతినిద్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో 98 శాతంతో మొదటిస్థానంలో ఉండగా, మంత్రి కేటిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లా: 91 శాతంతో రెండవ స్థానంలో మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్ధిపేట :88 శాతం, ఎమ్మెల్యే రాజయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న స్టేషన్ ఘన్ పూర్: 86 శాతంతో నాల్గవ స్థానంలో నిలిచినట్లు ప్రకటించారు. మిగిలిన శాసనసభ్యుల పనితీరుపై కూడా కేసీఆర్ నివేదికలు ఇచ్చారు. అయితే ఇదివరకు చేసిన హెచ్చరికల వలన ఈసారి తెరాస ఎమ్మెల్యేలు అందరి పనితీరులో బాగా మెరుగుదల కనిపించి చాలా మందికి కనీసం 50 శాతం పైనే మార్కులు పొందగలిగారు. కనుక ప్రజా ప్రతినిధులు అందరూ ఇక నుంచి తమ తమ నియోజకవర్గాల అభివృద్ధికి, అక్కడి సమస్యల పరిష్కారానికి మరింత కృషి చేయాలనీ ముఖ్యమంత్రి కేసీఆర్ అందరికీ గట్టిగా చెప్పారు.