త్వరలో కలెక్టర్ కార్యాలయాల నిర్మాణం షురూ

రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన చేసి కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడంతో అన్ని జిల్లాలకు కలెక్టర్, రెవెన్యూ తదితర ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు అనివార్యం అయ్యింది. కనుక కలెక్టర్ కార్యాలయంతో సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఉండేవిధంగా ప్రతీ జిల్లాకు ఒకటి చొప్పున ఇంటిగ్రేటడ్ కలెక్టర్ కార్యాలయాలు నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. వాటిలో జిల్లాకు చెందిన సుమారు 50 వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తాయి. కనుక ఒక్కో కార్యాలయం కనీసం 20-25 ఎకరాల విస్తీర్ణంలో అత్యాదునిక  సౌకర్యాలతో ఉండే విధంగా భవనాలను నిర్మించబోతున్నారు. వాటికి జూన్ మొదటివారంలోగా టెండర్లు ఖరారు చేసి నెలాఖరులోగా పనులు మొదలుపెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్లు భవనాల శాఖ అధికారులను ఆదేశించారు. జూన్ లోనే నిర్మాణపనులు మొదలుపెట్టి 12నెలలోగా అన్ని భవనాలను అప్పజెప్పాలని ఆదేశించారు.