త్రుటిలో ప్రాణాలతో బయటపడిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, మరొక మంత్రి కలిసి ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ఈరోజు కొద్దిసేపటి క్రితం ప్రమాదానికి గురయి లాతూరులో నేలకూలింది. కానీ అదృష్టవశాత్తు ఈ ప్రమాదం నుంచి ముఖ్యమంత్రి, మిగిలినవారు కూడా ప్రాణాలతో బయటపడిగలిగారు. ఈ ప్రమాదంలో హెలికాఫ్టర్ రెక్కలు విరిగిపోయాయి. ఈ సంగతి తెలిసిన వెంటనే పోలీస్ అధికారులు, ఉన్నతాధికారులు హుటాహుటిన ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకొన్నారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగినా హెలికాఫ్టర్ పైలట్ తో సహా దానిలో ప్రయాణిస్తున్నవారు సురక్షితంగా బయటపడటం చాలా అదృష్టం..విశేషమే.  ఈ ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియవలసి ఉంది.