ఇంతకీ ఆ కేసులో దోషులెవరు?

ఒకప్పుడు యూపిఏ హయంలో సంచలనం సృష్టించిన బొగ్గు కుంభకోణంలో అనేకమంది రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు, పారిశ్రామికవేత్తల పేర్లు వినిపించాయి. ఆ కేసులో మాజీ బొగ్గుశాఖ సహాయమంత్రిగా పనిచేసిన దాసరి నారాయణ రావుకు కూడా సమన్లు అందాయి. అదే కేసులో మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కు కోర్టు సమన్లు కూడా జారీ అయ్యాయి. కానీ సరైన ఆధారాలు లేవంటూ సుప్రీంకోర్టు ఆయనపై కేసును కొట్టివేయడంతో వాటి నుండి ఆయన బయటపడగలిగారు. ఆయన ఒక్కరే కాదు..బడాబాబులు అందరూ బయటపడగలిగారు.

బొగ్గుమంత్రిత్వశాఖ మాజీ కార్యదర్శి హెచ్.సి.గుప్తా, సంయుక్త కార్యదర్శి కెఎస్. కోప్రా, మాజీ డైరక్టర్ కేసి సమారియాలను డిల్లీ కోర్టు దోషులుగా నిర్ధారించి ఒక్కొక్కరికీ రెండేళ్ళ జైలు శిక్ష విదించింది. కానీ వారికి ఒక్కొక్కరికీ లక్ష రూపాయల స్వంత పూచీకత్తు, అంతే మొత్తానికి ఇతరుల ద్వారా ష్యూరిటీ మీద బెయిల్ మంజూరు చేసింది. అంటే అనేక వందల కోట్ల కుంభకోణం కేసులో చివరికి వారికి కూడా శిక్షలు పడకుండా  తప్పించుకోగలిగారన్న మాట! అందుకే అన్నారు న్యాయం అందరికీ సమానమే కానీ కొందరికి అధిక సమానమని! అయితే ఇంతకీ ఆ కేసులో దోషులెవరు? ఎప్పుడు శిక్షించబడుతారు? వారు దోచుకొన్న దేశసంపదని ఎవరి దగ్గర నుంచి వసూలు చేయాలి? అనే ప్రశ్నలకు జవాబులు ఎప్పటికీ దొరకకపోవచ్చు.