కోమటిరెడ్డిపై గుత్తా సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ ఎంపి, ప్రస్తుత తెరాస నేత గుత్తా సుఖేందర్ రెడ్డి నల్లగొండ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. “కోమటిరెడ్డి రౌడీయిజం గురించి కాంగ్రెస్ లో అందరికీ తెలుసు. అయన రౌడీయిజం ద్వారా రాజకీయాలలో పైకి ఎదగాలనుకొంటాడు. మొన్న మంత్రి హరీష్ రావు జిల్లాకు వచ్చి బొత్తాయి మార్కెట్ నిర్మాణానికి శంఖుస్థాపన చేయడానికి వచ్చినప్పుడు కోమటిరెడ్డి మళ్ళీ తన రౌడీయిజాన్ని మరోమారు ప్రదర్శించుకొన్నాడు. అటువంటి వ్యక్తి భాజపాలోకి ఎక్కడ వెళ్ళిపోతాడో అనే భయంతో జానారెడ్డి, షబ్బీర్ అలీ వంటి సీనియర్ నేతలు ఆయనను వెనకేసుకొని వస్తూ మాట్లాడుతున్నారు. అయన కాంగ్రెస్ వదిలిపోతుంటే సంతోషించాలి కానీ బాధపడటం ఎందుకు? తెరాస సర్కార్ చేస్తున్న మంచిపనులకు అడ్డుపడుతున్న కోమటిరెడ్డిని జిల్లా ప్రజలు ఎన్నటికీ క్షమించరు,” అని గుత్తా అన్నారు.