తెదేపా ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి ఇళ్ళపై ఈరోజు సిబిఐ అధికారులు దాడులు చేసి శోదాలు నిర్వహించారు. ఆయనకు చెందిన హైదరాబాద్, బెంగళూరు, నెల్లూరు ఇళ్ళలో సిబిఐ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. ఆయన ప్రధాన భాగస్వామిగా ఉన్న వి.ఎన్.ఆర్.ఇన్ ఫ్రా, మరికొన్ని సంస్థలు వివిధ బ్యాంకుల నుంచి సుమారు రూ.450 కోట్లు రుణాలు తీసుకొని వాటిని తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకుల పిర్యాదు మేరకు మొదట ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేయగా ఇప్పుడు సిబిఐ అధికారులు దాడులు చేశారు. తమ పార్టీ ఎమ్మెల్సీపై జరిగిన ఈ సిబిఐ దాడుల గురించి తెదేపా నేతలు ఎవరూ స్పందించలేదు. ఏపి సిఎం చంద్రబాబు నాయుడు విజయవాడ తిరిగ వచ్చిన తరువాత ఎమ్మెల్సీ వివరణ కోరవచ్చని తెదేపా నేతలు భావిస్తున్నారు.