గ్యాంగ్ స్టర్ నయీం కేసులో గురువారం ఊహించని పరిణామం జరిగింది. నయీంతో సంబంధాలు ఉన్నట్లు భావిస్తున్న ఐదుగురు పోలీస్ అధికారులను రాష్ట్ర డిజిపి అనురాగ్ శర్మ సస్పెండ్ చేశారు. మరో 16మందిపై విరణకు ఆదేశించారు. ఈరోజు సస్పెండ్ అయిన అధికారులతో కలిపి ఇంతవరకు పోలీస్ శాఖలో మొత్తం 25మందిపై చర్యలు తీసుకొన్నారు.
ఈరోజు సస్పెండ్ అయినవారిలో ఎసిపి మలినేని శ్రీనివాస్ (మీర్ చౌక్), సిసిఎస్ ఎసిపి చినతమనేని శ్రీనివాస్, సి రాజగోపాల్ (కొత్తగూడెం), ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మస్తాన్ (సంగారెడ్డి) ఉన్నారు.
నయీం కేసులో అధికార తెరాస, ప్రతిపక్ష పార్టీలకు చెందిన కొందరు రాజకీయ నేతల పేర్లు కూడా వినబడ్డాయి. కానీ వారిలో ఏ ఒక్కరిపై కేసులు నమోదు చేసినట్లు సమాచారం లేదు. వారిలో చాలా మంది రాజకీయ పలుకుబడి ఉన్నవారు కావడమే అందుకు కారణం అయ్యుండవచ్చు.