ఎన్నికలకు తెరాస సన్నాహాలు షురూ?

సార్వత్రిక ఎన్నికలకు ఇంకా మరో రెండేళ్ళ సమయం ఉంది. కానీ రాష్ట్రంలో, దేశంలో అన్ని పార్టీలు అప్పుడే ‘ఎన్నికల మోడ్’లోకి వచ్చేశాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెరాస కూడా అందుకు మినహాయింపు కాదు. “మా ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ఇప్పటి నుంచే ప్రచారం చేసుకోవాలని మేము ఆలోచిస్తున్నాము. మాకు 75 లక్షల మంది తెరాస కార్యకర్తలున్నారు. వారి ద్వారా గ్రామస్థాయి వరకు ఇంటింటికీ ప్రచారం చేయాలనుకొంటున్నాము. మా ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ఇప్పటి నుంచే ప్రజలకు వివరించి వారిని చైతన్యపరిచినట్లయితే వచ్చే ఎన్నికల సమయంలో కలిసివస్తుంది. మా కార్యకర్తల ద్వారానే మా పధకాలలో లోటుపాట్లు, వాటిపై ప్రజల అభిప్రాయలు కూడా అడిగి తెలుసుకొని వాటిని సరిదిద్దుకొని ముందుకు సాగాలనుకొంటున్నాము,” అని అన్నారు తెరాస నేత, మండలిలో ప్రభుత్వం విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి.