ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చాలా కీలకవ్యక్తిగా వ్యవహరిస్తున్న మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కుమారుడు నిశిత్ నారాయణ (23), అతని స్నేహితుడు రవి వర్మ ఇద్దరూ నిన్న రాత్రి కారు ప్రమాదంలో మరణించారు. మంగళవారం రాత్రి వారిరువురు హైదరాబాద్, జూబ్లీ హిల్స్ రోడ్డు నెంబర్: 36 ప్రయాణిస్తున్నప్పుడు వారి బెంజ్ కారు అదుపు తప్పి రోడ్డు మద్యలో ఉన్న మెట్రో రైల్ పిల్లర్ ను బలంగా డ్డీ కొనడంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో రోడ్లు ఊడుస్తున్న జి.హెచ్.ఎం.సి. సిబ్బంది వారిరువురిని అపోలో ఆసుపత్రికి తరలించారు. కానీ ఇద్దరూ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు.
వారిరువురు మద్యం మత్తులో అతివేగంగా కారు నడుపడం వలననే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాధమిక సమాచారం. నిశిత్ నారాయణ, నారాయణ విద్యాసంస్థల బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. మంత్రి నారాయణ ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్నారు. ఈ సంగతి తెలియగానే ఆయన తక్షణమే హైదరాబాద్ బయలుదేరి వస్తున్నారు.