ఇటీవల తెలంగాణా శాసనసభ, మండలి ఆమోదించి పంపిన తెలంగాణా భూసేకరణ చట్టానికి కేంద్రప్రభుత్వం మంగళవారం ఆమోదించి రాష్ట్రపతికి పంపించింది. ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రపతి ఆమోదముద్ర పడగానే అది చట్టంగా అమలులోకి వస్తుంది.
భూసేకరణ చట్టం-2013కు అనుకూలంగా ఇదివరకు తెలంగాణా ప్రభుత్వం ఏర్పాటు చేసుకొన్న భూసేకరణ చట్టంలో ఆరు సవరణలు చేయాలనే కేంద్రప్రభుత్వం సూచన మేరకు తెలంగాణా ప్రభుత్వం బిల్లుకి సవరణలు చేసి కేంద్రం ఆమోదానికి పంపించింది. ఈ సవరణలు చేయడం ద్వారా ఇక ప్రతిపక్షాలు భూసేకరణపై కోర్టులలో పిటిషన్లు వేసి అడ్డుపడలేవని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అదే నిజమయితే ఇక నిర్వాసిత రైతుల పక్షాన్న ప్రతిపక్షాలు పోరాడలేవు కనుక రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల కోసం భూసేకరణ కార్యక్రమం వేగవంతం అవుతుంది. దానితో ప్రాజెక్టుల నిర్మాణం కూడా వేగవంతం అవుతుంది. అయితే ఈ కొత్త చట్టం ద్వారా నిర్వాసిత రైతులకు పూర్తి న్యాయం జరుగుతుందా లేదో చూడాలి.