నగరంలో నేటి నుంచి హెలీ టూరిజం

హైదరాబాద్ వాసులకు ఒక సంతోషకరమైన వార్త. నేటి నుంచి ఈనెల 13 వరకు నగరవాసులకు హెలికాఫ్టర్ రైడ్స్ అందుబాటులోకి వచ్చాయి. సుమారు 10-15 నిమిషాల పాటు ఈ హెలికాఫ్టర్ రైడ్ లో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలపై విహరిస్తూ రెండు ప్రాంతాలలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను అన్నిటినీ చూడవచ్చు. నెక్లెస్ రోడ్డు నుంచి మొదలయ్యే ఈ హెలికాఫ్టర్ రైడ్స్ ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ గార్డెన్స్, బిర్లామందిర్, చార్మినార్, హకోర్టు, సంజీవయ్య పార్క్, స్నో వరల్డ్ మీదుగా సాగి మళ్ళీ నెక్లెస్ రోడ్డుకు చేరుకొంటుంది. ఇండ్ వెల్ ఏవియేషన్ సంస్థ, జి.హెచ్.ఎం.సి. కలిసి సంయుక్తంగా ఈ హెలికాఫ్టర్ రైడ్స్ నిర్వహిస్తున్నాయి. హెలికాఫ్టర్లో పర్యటించదలచుకొన్నవారు 9447777110 అనే నెంబరుకు ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.