హైదరాబాద్ లో జనసేన నియామకాలు!

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఇతర రాజకీయ పార్టీల మాదిరిగా కాకుండా ప్రజలలో నుంచే తన ఆశయాలతో ఏకీభవించేవారిని ఎంచుకొంటూ  ఒక పద్ధతి ప్రకారం తన పార్టీ నిర్మాణ కార్యక్రమాన్ని చేసుకొంటున్నారు. వచ్చే ఎన్నికలలో రెండు రాష్ట్రాలలో జనసేన పోటీ చేయస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు కనుక తెలంగాణాలో ముందుగా గ్రేటర్ హైదరాబాద్ నుంచి పార్టీ నిర్మాణ కార్యక్రమం మొదలుపెట్టారు. హైదరాబాద్ పరిధిలో జనసేనలో చేరి పార్టీ కోసం పనిచేయడానికి ఆసక్తి ఉన్నవారి నుండి ఆన్-లైన్ లో దరఖాస్తులు ఆహ్వానించింది. ఆసక్తి కలవారు: http://janasenaparty.org/greaterhyderabad/  కు ఈనెల 13లోగా తమ దరఖాస్తులు పంపించవలసిందిగా ఒక ప్రకటన ద్వారా కోరింది. కొన్ని రోజుల క్రితమే అనంతపురం జిల్లాలో ఇదే పద్దతిలో సభ్యులను ఎంపిక చేసుకొంది. ఇప్పుడు హైదరాబాద్ తో బాటు ఆంధ్రప్రదేశ్ లో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ప్రజల నుంచి కూడా దరఖాస్తులు ఆహ్వానించింది. 

ఆన్ లైన్ లో దరఖాస్తులు పంపవలసిన లింక్స్:      

 విశాఖ జిల్లా: http://janasenaparty.org/visakhadistrict/  

విజయనగరంజిల్లా: http://janasenaparty.org/vijayanagaramdistrict/ 

శ్రీకాకుళం: http://janasenaparty.org/srikakulamdistrict/