“ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్మికులు, రైతులు, యువత ఎవరూ సంతోషంగా లేరు. తెదేపా ప్రభుత్వం కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను అవలంభిస్తోంది. దాని పాలనకు ముగింపు పలికే సమయం దగ్గర పడింది. వచ్చేది మన ప్రభుత్వమే. దానికి ఇంకెంతో సమయం లేదు. మన సమస్యలన్నిటినీ మనమే పరిష్కరించుకొందాము,” అని జగన్మోహన్ రెడ్డి అన్నారు.
గుంటూరు బస్టాండ్ వద్ద జరిగిన మేడే వేడుకలలో పాల్గొన్న జగన్ కార్మికులను, ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “చంద్రబాబు నాయుడు వీలుంటే ఆర్టీసిని కేశినేని నాని లేదా జేసి దివాకర్ రెడ్డికి, రాష్ట్రంలోని విద్యాసంస్థలను అన్నిటినీ మంత్రి నారాయణకి, విద్యుత్ సంస్థలను సి.ఎం రమేష్ లేదా సుజనా చౌదరికీ అమ్మేసేలాగున్నారు,” అని ఎద్దేవా చేశారు.