ఆవులకు ఆధార్!

దేశంలో ఆవుల అక్రమరవాణా, వధ అరికట్టడానికి ఆవులకు కూడా ఆధార్ కార్డు వంటి ప్రత్యేక గుర్తింపు సంఖ్యలను ఏర్పాటు చేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఒక కమిటీ దేశంలో ఆవుల అక్రమ రవాణాపై అద్యయనం చేసి కేంద్రానికి ఒక నివేదిక ఇచ్చింది. దేశంలో గోసంపదను రక్షించుకోవడానికి వాటికి ఆధార్ తరహా గుర్తింపు సంఖ్యను కేటాయించాలని ఆ కమిటీ సూచించింది. దానిలో ఆవుల పుట్టిన తేదీ, వయసు, రంగు, కొమ్ముల ఆకారం వగైరా వివరాలు ఉంటాయి. ఇవికాక ఆవులను నిర్దిష్టంగా గుర్తించేందుకు వీలుగా ప్రతీ ఆవు చెవిలో 12 అంకెల ఆధార్ తరహా గుర్తింపు నెంబరును వ్రాయాలని సూచించింది. దేశంలో అన్ని రాష్ట్రాలలో ప్రతీ జిల్లాలో అనాధ ఆవులకు ఆశ్రయం కల్పించేందుకు తగిన గోశాలలను నిర్మించాలని సూచించింది. ఈ కమిటీ సిఫార్సులను అమలు చేయడానికి కేంద్రప్రభుత్వం సూచన ప్రాయంగా అంగీకరించింది. దీని కోసం తొలిదశలో రూ.148 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది.