మిషన్ భగీరథకు జాతీయ అవార్డు

తెలంగాణాలో ఇంటింటికీ మంచి నీళ్ళు అందించాలనే ఉద్దేశ్యంతో తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన వినూత్నమైన మిషన్ భగీరథ పధకానికి సర్వత్రా ప్రశంశలు వస్తున్న సంగతి తెలిసిందే. దానికి మరో అరుదైన గుర్తింపు లభించింది. మౌలికవసతుల కల్పనలో ఇది ఒక వినూత్నమైన విజయవంతమైన ప్రయోగమని కేంద్రప్రభుత్వం గుర్తించి, ఈ పధకానికి జాతీయ అవార్డు ప్రకటించింది. ఏప్రిల్ 25న కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఈ అవార్డును  రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిధి అందుకోబోతున్నారు. రాష్ట్ర రాష్ట్రంలో రాజకీయ ఆధిపత్యం కోసం తెరాస-భాజపాల మద్య యుద్ధం జరుగుతున్నప్పటికీ, ఈ ప్రాజెక్టుకు అరుదైన పురస్కారం రావడం గమనిస్తే, ఒక మంచి ఉద్దేశ్యంతో..చిత్తశుద్ధితో చేసే ఏ పనికైనా తప్పక ఫలితం ఉంటుందని అర్ధం అవుతుంది.